సీఎం కేసీఆర్‌ను ఓడించిన బీజేపీ అభ్యర్థికి వచ్చింది ఎంత మెజార్టీనో తెలుసా?

తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగించింది. ...

Update: 2023-12-03 11:05 GMT

దిశ, వెబ్ డెస్క్:తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగించింది. తర్వాత స్థానంలో బీఆర్ఎస్ నిలబడింది. ఈ రెండు పార్టీలో ఓ చోట మాత్రం చతికిలపడ్డాయి. అది కూడా ఇద్దరు ఉద్దండులు పోటీ చేసినా వారిని బీజేపీ మట్టికరిపించింది. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్, తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇద్దరూ కామారెడ్డిలో పోటీ చేశారు. అయితే అక్కడి ప్రజలకు స్థానికతకే పట్టం కట్టారు. కేసీఆర్, రేవంత్ ఇద్దరూ కూడా నాన్ లోకల్ నాయకులే. అయితే ఈ కామారెడ్డిలో గెలవాలని ప్రయత్నించారు. కానీ వీరిద్దరికి బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి షాక్ ఇచ్చారు. సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై 6 వేలకు పై చిలుకు మెజార్టీ ఓట్లతో వెంకటరమణా రెడ్డి గెలుపొందారు. కేసీఆర్ ను ఓడిస్తానని రేవంత్ రెడ్డి సవాల్ చేసి మరీ కామారెడ్డి బరిలో దిగారు. అయితే ఆయనకు కామారెడ్డి ప్రజలు దిమ్మతిరిగే తీర్పు ఇచ్చారు. ఇద్దరినీ కాదని స్థానికుడైన వెంకటరమణారెడ్డికి పట్ట కట్టారు. దీంతో కామారెడ్డి బీజేపీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొంది.


Similar News