కలుషిత తాగునీటి ఘటనపై ప్రభుత్వం సీరియస్.. ఇద్దరు ఏఈలు సస్పెండ్

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవరావు పేట కలుషిత తాగునీటి ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది.

Update: 2024-10-14 17:02 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవరావు పేట కలుషిత తాగునీటి ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. విధుల్లో అలసత్వం వహించిన మిషన్ భగీరథ ఇద్దరు ఏఈ ఈ ల ను సస్పెండ్ చేసింది. మిషన్ భగీరథ నారాయణఖేడ్ గ్రిడ్ ఏఈఈ డి రవికుమార్, ఇంట్రా ఏఈఈ బి శ్రీకాంత్ లను సస్పెండ్ చేస్తున్నట్లు గ్రామీణ అభివృద్ధి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం మంత్రి సీతక్క కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మిషన్ భగీరథ మోటర్ పాడైన నేపథ్యంలో బావి నుంచి తాగు నీరు సరఫరా అవడంతో… అది తాగి తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. మిషన్ భగీరథ నీళ్లు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో తాగునీరు సరఫరా చేసే ముందే ఆ నీటిని కచ్చితంగా పరీక్షించాల్సి ఉంటుంది. కానీ, ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే పై అధికారులకు కనీస సమాచారం లేకుండా బావి నుంచి తాగునీటి సరఫరాను చేసిన గ్రామ పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.


Similar News