TGPSC:రేపటి నుంచే గ్రూప్-2 పరీక్షలు ప్రారంభం.. అభ్యర్థులు పాటించాల్సిన సూచనలివే!

రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షల(Group-2 Exams) నిర్వహణ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) పకడ్బందీగా ఏర్పాట్లు సిద్ధం చేసింది.

Update: 2024-12-14 03:12 GMT

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షల(Group-2 Exams) నిర్వహణ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) పకడ్బందీగా ఏర్పాట్లు సిద్ధం చేసింది. రేపటి(డిసెంబర్ 15, 16) నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో పరీక్షా కేంద్రాల(Exam Centers) వద్ద భారీ బందోబస్తు చర్యలు చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1368 కేంద్రాలు ఏర్పాటు చేసింది. గ్రూప్-2 పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. టీజీపీఎస్సీ(TGPSC) నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. పేపర్-1 డిసెంబర్ 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 ఉంటుంది. మరుసటి రోజు డిసెంబర్ 16న పేపర్​3, 4 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు టీజీపీఎస్సీ(TGPSC) పలు కీలక సూచనలు చేసింది.

TGPSC కీలక సూచనలు:

*గ్రూప్-2 అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ కోసం https://www.tspsc.gov.in/ వెబ్ సైట్‌ను సందర్శించండి.

*హాల్ టికెట్ ఉన్నవారినే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు.

*పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లే క్రమంలో ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక ఒరిజినల్ ఐడీని(Passport, Pan Card, Voter ID, Aadhaar Card, Government Employee ID లేదా డ్రైవింగ్ లైసెన్స్ ) చూపించాల్సి ఉంటుంది.

*హాల్ టికెట్ పై ఫొటో స్పష్టంగా కనిపించేలా ఉండాలి. ఇలా లేకపోతే గెజిటెడ్ అధికారితో సంతకం చేయించుకోవాలి.

*ఉదయం 8.30 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. 9.30 గంటలకు గేట్లు మూసివేస్తారు.

*ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి తీసుకెళ్లరాదు.

*మాల్ ప్రాక్టీసింగ్, చీటింగ్ వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి. టీజీపీఎస్సీ నిర్వహించే పరీక్షలు రాయకుండా చర్యలు తీసుకుంటారు.

*అభ్యర్థుల ఇబ్బందులను నివృత్తి చేసేందుకు జిల్లాల వారీగా హెల్ప్‌ లైన్‌(HelpLine) నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఫోన్ నెంబర్లతో కూడిన జాబితాను వెబ్ సైట్‌లో విడుదల చేసింది.

Tags:    

Similar News