Shabarimala: దయచేసి శబరిమలకు రావొద్దు.. అయ్యప్ప భక్తుడి వీడియో సందేశం
దయచేసి ఈ సమయంలో శబరిమలకు(Shabarimala) అయ్యప్ప భక్తులు(Ayyappa Devotees) ఎవరు రావొద్దని ఓ భక్తుడు సోషల్ మీడియా(Social Media)లో వీడియో సందేశం (Video Message) విడుదల చేశాడు.
దిశ, వెబ్ డెస్క్: దయచేసి ఈ సమయంలో శబరిమలకు(Shabarimala) అయ్యప్ప భక్తులు(Ayyappa Devotees) ఎవరు రావొద్దని ఓ భక్తుడు సోషల్ మీడియా(Social Media)లో వీడియో సందేశం (Video Message) విడుదల చేశాడు. శబరిమలలో తుఫాన్ కారణంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయని, మాల ధరించిన భక్తులు ఈ సమయంలో శబరిమలకు రావద్దని సూచించాడు. ఇదే వాన ఇంకో 3,4 రోజులు ఉండే అవకాశం ఉందని, భక్తులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని కోరాడు. తుఫాన్ కారణంగా కొండ చరియల్లో చెట్లు విరిగి పడుతున్నాయని, కొండపై పూర్తిగా ట్రాఫిక్ జాం ఏర్పడుతుందని తెలిపాడు. అంతేగాక ఈ సమయంతో శబరిమలకు రావడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నామని, దయచేసి మాల ధరించిన భక్తులు కూడా కొంత సమయం ఆగి తుఫాన్ ప్రభావం తగ్గిన తర్వాత ప్రయాణాన్ని మొదలు పెట్టాలని వీడియో ద్వారా సందేశం ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.