ఎన్ని కుట్రలు చేసినా నిజం గెలుస్తుంది: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే
పుష్ప-2 సినిమా(Pushpa-2 Movie) ప్రీమియర్ షోల సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో శుక్రవారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
దిశ,వెబ్‌డెస్క్: పుష్ప-2 సినిమా(Pushpa-2 Movie) ప్రీమియర్ షోల సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో శుక్రవారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు(శనివారం) ఉదయం అల్లు అర్జున్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ పై సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో జాతీయ అవార్డు గ్రహీత టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అరెస్టుని హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో మరోసారి అల్లు అర్జున్ అరెస్ట్ పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా నిజం గెలుస్తుందని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. వారం రోజుల క్రితం నాకు ఎలాగైతే జరిగిందో.. నిన్న అల్లు అర్జున్‌కు కూడా అలాగే జరిగిందని సోషల్ మీడియాలో వారిద్దరి అరెస్ట్ వీడియోలను షేర్ చేశారు. ఇది కేవలం అల్లు అర్జున్ పై జరిగిన దాడి కాదని, ప్రజాస్వామ్యం, మనం గౌరవించే విలువలపై జరిగిన దాడి అని’’ ఆయన అన్నారు.