Dhanam: అల్లు అర్జున్ మాకు బంధువే.. ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు
అల్లు అర్జున్(Allu Arjun) మాకు బంధువే(Relative) అవుతారని, ఆయన అరెస్ట్(Arrest) బాధాకరమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(khairathabad MLA Danam Nagendar) అన్నారు.
దిశ, వెబ్ డెస్క్: అల్లు అర్జున్(Allu Arjun) మాకు బంధువే(Relative) అవుతారని, ఆయన అరెస్ట్(Arrest) బాధాకరమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(khairathabad MLA Danam Nagendar) అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించారు. అల్లు అర్జున్ జాతీయ నటుడే కాదు.. ప్రపంచ స్థాయి నటుడని, ఆయనను అరెస్ట్ చేయడం కొంత బాధ కలిగించిందని చెప్పారు. అల్లు అర్జున్ ను ప్రభుత్వమే అరెస్ట్ చేయించిందని ప్రతిపక్షాలు(Oppositions) అనడం భావ్యం కాదని అన్నారు. జరిగిన సంఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని, ఏది ఏమైనా మొత్తానికి బెయిల్ దొరకడం సంతోషకరంగా ఉందన్నారు. సినిమాల్లో అల్లు అర్జున్ నటన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాలకు మంచి పేరు తీచ్చిపెట్టిందని తెలిపారు. ఆయన అరెస్ట్ కావడాన్ని దురదృష్టకర సంఘటనగా భావిస్తున్నానని దానం నాగేందర్ అన్నారు.