Chamala: ప్రతిపక్షాల ఆరోపణలు సరికాదు.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై చామల కిరణ్

అల్లు అర్జున్ అరెస్ట్(Allu Arjun Arrest) పట్ల బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) నేతలు మాపై ఆరోపణలు చేయడం సరికాదని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ(Bhuvanagiri Congress MP) చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) అన్నారు.

Update: 2024-12-14 08:14 GMT

దిశ, వెబ్ డెస్క్: అల్లు అర్జున్ అరెస్ట్(Allu Arjun Arrest) పట్ల బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) నేతలు మాపై ఆరోపణలు చేయడం సరికాదని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ(Bhuvanagiri Congress MP) చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) అన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ పట్ల వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ.. సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. భారతదేశ వ్యాప్తంగా అల్లు అర్జున్ అరెస్ట్ పై చర్చ నడుస్తోందని ఇదే అదునుగా ప్రతిపక్షాలు(Oppositions) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై, కాంగ్రెస్ పార్టీ(Congress Party)పై ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. వీఐపీలు(VIP) ఎక్కడికి వెళ్లినా.. ఏదైనా కార్యక్రమం నిర్వహించినా,, అన్ని జాగ్రత్తలు తీసుకొని పోవాల్సి వస్తుందని అన్నారు.

అక్కడ ఏదైనా తప్పులు జరిగితే కేసులు పెట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ ఘటనలో థియేటర్ యాజమాన్యంతో పాటు అందరిపై కేసులు పెట్టి, విచారణ జరుపుతున్నారని, దీనిపై అనవసరంగా బీఆర్ఎస్, బీజేపీ నాయకులు రాద్దాంతం చేసి, ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని అన్నారు. తొక్కిసలాట ఘటనలో ఓ నిండు ప్రాణం పోయిందని, మరో ప్రాణం ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోందని, దీని గురించి మాట్లాడకుండా దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. చట్టం అందరినీ సమానంగా చూస్తుందని, చట్టానికి ఎవరు అతీతులు కాదని, అల్లు అర్జున్ ఫేమస్ హీరో అని చెప్పి అతని మీద కేసులు పెట్టకుండా అడ్డుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదని చెప్పారు. కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు అర్థం చేసుకోవాలని చామల కిరణ్ వివరించారు.

Tags:    

Similar News