అమ్మవారి ఆలయ ప్రాగణంలో భారీ కొండచిలువ

హన్మకొండ (Hanmakonda) జిల్లా కేంద్రంలోని పద్మాక్షి గుట్ట ప్రాంతంలో భారీ కొండచిలువ (python) ప్రత్యక్షమైంది

Update: 2024-12-14 05:51 GMT

దిశ, వెబ్ డెస్క్: హన్మకొండ (Hanmakonda) జిల్లా కేంద్రంలోని పద్మాక్షి గుట్ట ప్రాంతంలో భారీ కొండచిలువ (python) ప్రత్యక్షమైంది. దీనితో అక్కడి ప్రజలు భయందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన స్థానికులు వెంటనే ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలిపారు. సమాచారం తెలుకొని అక్కడికి వచ్చిన అధికారులు దాదాపు అర్ధగంటకు పైగా శ్రమించి ఆ భారీ కొండచిలువను పట్టుకున్నారు. అనంతరం హన్మకొండలోని కాకతీయ జూలాజికల్ పార్క్‌కు (Kakatiya Zoological Park) ఆ కొండచిలువను తరలించారు. దీంతో అక్కడి స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ పామును పార్క్‌లో ఉంచడం ద్వారా సురక్షితంగాను ఉంటుందని, పార్క్ వచ్చిన వారికి కనుమరుగు అవుతున్న జీవాలను చూసే అవకాశం లభిస్తు్ందని అధికారులు ఆలోచన చేశారు.

Tags:    

Similar News