Mohan Babu:‘అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు వార్తలు’.. ఎట్టకేలకు స్పందించిన మంచు మోహన్‌బాబు

సినీ నటుడు మంచు మోహన్‌ బాబు (Mohan babu) అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం.

Update: 2024-12-14 06:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: సినీ నటుడు మంచు మోహన్‌ బాబు (Mohan babu) అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. జల్‌ప‌ల్లిలో ఉన్న త‌న నివాసంలో జ‌ర్నలిస్టుపై దాడి ఘ‌ట‌న‌కు సంబంధించి ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆయన ఎక్కడా కనిపించడం లేదని, శుక్రవారం నుంచి మోహన్‌బాబు కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మోహ‌న్ బాబు అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.

అలాగే ఈ పిటిష‌న్‌కు సంబంధించి విచార‌ణ‌ను గురువారానికి వాయిదా వేసింది. దీంతో మోహన్‌ బాబు అరెస్ట్‌ నుంచి తప్పించుకునేందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల పై తాజాగా మంచు మోహన్ బాబు స్పందించారు. తాను ఇంట్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు మోహన్ బాబు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా(X) వేదికగా పోస్ట్ పెట్టారు. ‘నా ముందస్తు బెయిల్ తిరస్కరించలేదు. ప్రస్తుతం ఇంట్లో వైద్యుల సంరక్షణలో ఉన్నాను. వాస్తవాలను మాత్రమే బయట పెట్టాలని మీడియాను కోరుతున్న’ అని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News