Revanth Reddy: ఢిల్లీలో మూడు రోజుల పర్యటన.. హైదరాబాద్ బయలుదేరిన సీఎం
మూడు రోజుల పాటు ఢిల్లీ పర్యటనకు(Delhi Tour) వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఇవాళ ఉదయం హైదరాబాద్(Hyderabad) బయలుదేరారు.
దిశ, వెబ్ డెస్క్: మూడు రోజుల పాటు ఢిల్లీ పర్యటనకు(Delhi Tour) వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఇవాళ ఉదయం హైదరాబాద్(Hyderabad) బయలుదేరారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసం నుంచి ఎయిర్ పోర్టుకు వెళ్లి, అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కి స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున శంషాబాద్ విమానాశ్రయానికి(Shamshabad Airport) చేరుకున్నారు. సీఎం విమానాశ్రయం నుంచి నేరుగా జూబ్లీహిల్స్(Jubili Hills) లోని ఆయన నివాసానికి చేరుకోనున్నట్లు తెలిసింది. అనంతరం కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన గురుకుల బాట(Gurukula Bata) కార్యక్రమంలో భాగంగా గురుకుల హస్టల్ ను సందర్శించనున్నారు. కాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన రేవంత్ రెడ్డి మొదటి రోజు జైపూర్ లో జరుగుతున్న బంధువుల పెళ్లికి హాజరయ్యారు. అనంతరం ఢిల్లీ చేరుకొని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల(Congress MPs) బృంధంతో కలిసి పలువురు కేంద్ర మంత్రులతో(Union Ministers) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్దిపై పలు ప్రతిపాధనలు చేశారు.