BRS: అల్లు అర్జున్ మీద సీఎం రేవంత్ కుట్రకు కారణమిదే.. కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) అరెస్ట్‌పై బీఆర్ఎస్(BRS), హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-12-14 06:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) అరెస్ట్‌పై బీఆర్ఎస్(BRS), హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పుష్ప-2 సక్సెస్ మీట్‌(Pushpa-2 Success Meet)లో థాంక్స్ చెప్పే తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి పేరును అల్లు అర్జున్ మర్చిపోయారు. అప్పటి నుంచే ఆయనపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కుట్ర చేశారని ఆరోపించారు. కావాలనే అరెస్ట్ చేయించి హింసించే ప్రయత్నం చేశారని అన్నారు.

దేశం, ప్రపంచం మొత్తం గౌరవిస్తున్న నటుడ్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దారుణంగా అవమానించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలు జీవితం గడిపేలా చేశారని అన్నారు. ఒక క్రిమినల్ మాదిరిగా అల్లు అర్జున్‌ను ట్రీట్ చేశారని అన్నారు. ఆయన ఏం తప్పు చేశాడని బెడ్రూములోకి వచ్చి అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. గతకొన్ని రోజులుగా కేటీఆర్‌ను కూడా అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ కేటీఆర్‌(KTR)ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండంలా మారడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News