డ్రగ్స్‌ కేసులపై సీఎంకు ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ

మాదకద్రవ్యాల కట్టడికి నమోదైన కేసుల విచారణలో స్పీడ్ పెంచాలని ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి కోరారు. సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం లేఖ రాశారు. ...

Update: 2024-06-28 16:56 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మాదకద్రవ్యాల కట్టడికి నమోదైన కేసుల విచారణలో స్పీడ్ పెంచాలని ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి కోరారు. సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం లేఖ రాశారు. కేసుల విచారణను త్వరితగతిన విచారణ చేపట్టి నిందితులకు కఠిన శిక్షలు పడేలా అధికారులకు తగిన సూచనలు చేయాలని డిమాండ్ చేశారు. మాదకద్రవ్యాల రవాణా, వ్యాపారాన్ని కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలు అభినందనీయమన్నారు. గట్టి నిఘాపెట్టి కేసులు నమోదు చేయడంతో పాటు ప్రజలకు మాదక ద్రవ్యాలతో కలిగే అనార్ధాలపై అవగాహన కార్యక్రమాలు ముమ్మరం చేయాలన్నారు. ఒకసారి కేసు నమోదు చేసిన తర్వాత సరైన విచారణ చేపట్టి కేసు ప్రాసిక్యూట్ చేసి నేరస్తులకు శిక్షపడేలా చర్యలుండాలన్నారు. 2017లో మేడ్చల్ జిల్లాలో కొందరు మాదకద్రవ్యాలు రవాణా చేస్తున్న కేసులు నమోదయ్యాయన్నారు. దీనిపై సిట్ ఏర్పాటు చేసి లోతుగా విచారణ చేశారని, డ్రగ్ పెడలర్స్ తెలిపిన సమాచారంతో సుమారుగా 62మంది డ్రగ్స్ వాడిన వారిని విచారణ చేశారన్నారు. 12 కేసులు నమోదు చేసి కోర్టులో చార్జీషిట్లు వేశారని, 7 సంవత్సరాల తర్వాత కొట్టివేశారన్నారు. ప్రాసిక్యూషన్ వారు నేరాన్ని నిరూపించడంలో విఫలం కావడంతోనే కేసును కొట్టివేసి నేరస్తులను విడుదల చేశారన్నారు. ఇలాంటి కేసులతో ఏమీ ఉండదని ప్రజల్లో అనుమానం వస్తుందని పద్మనాభరెడ్డి అభిప్రాయపడ్డారు


Similar News