తెలంగాణ గ్రూపు-1 మెయిన్స్‌పై గందరగోళం.. హైకోర్టు రియాక్షన్ ఇదే!

గ్రూపు-1 అభ్యర్థుల(Group-1 Candidates)కు తెలంగాణ హైకోర్టు(Telangana High Court)‌లో మరో షాక్ తగిలింది.

Update: 2024-10-18 06:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: గ్రూపు-1 అభ్యర్థుల(Group-1 Candidates)కు తెలంగాణ హైకోర్టు(Telangana High Court)‌లో మరో షాక్ తగిలింది. అప్పీల్ పిటిషన్‌ను పాస్ ఓవర్ చేసింది. ఈనెల 15న సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. అభ్యర్థులు డివిజన్ బెంచ్‌కు వెళ్లారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు పిటిషన్‌ను పాస్ ఓవర్ చేసింది. మరోవైపు మెయిన్స్ పరీక్షలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 21 నుంచి యథావిధిగా మెయిన్స్‌ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల విడుదల చేసింది. https://hallticket.tspsc.gov.in ద్వారా హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. టీజీపీఎస్సీ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు, క్యాప్చా ఎంటర్ చేస్తే.. పీడీఎఫ్ ఫార్మాట్‌లో హాల్ టికెట్ డౌన్ లోడ్ అవుతోంది.


Similar News