BJP: "నాఫ్రత్ కా బజార్"గా తెలంగాణ.. కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన ట్వీట్
కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా గొంతునొక్కే విధానాన్ని ఎంచుకున్నదని, తెలంగాణ నాఫ్రత్ కా బజార్‌గా మారుతోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా గొంతునొక్కే విధానాన్ని ఎంచుకున్నదని, తెలంగాణ నాఫ్రత్ కా బజార్‌గా మారుతోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. గ్రూప్ -1 అభ్యర్థుల అరెస్ట్ పై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్.. రాహుల్ గాంధీ ప్రేమ దుకాణాన్ని తెరుస్తానని వాగ్దానం చేశాడు, కానీ తెలంగాణ విద్వేషాల బజార్‌గా మారుతోందని తెలిపారు. రాత్రిపూట యువతులను అరెస్టు చేయడానికి మీకు ఎంత ధైర్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యోగ ఆశావాహులను అమానవీయంగా లాగడం, కొట్టడం చేసి, వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కాంగ్రెస్ ప్రభుత్వం రోజురోజుకి దిగజారిపోతుందని మండిపడ్డారు. అలాగే 29 జీవోపై మీ స్టాండ్ ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేగాక కోర్టు మీకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే మీరు పరీక్షను మళ్లీ నిర్వహిస్తారా అని ప్రశ్నించారు. ఇక తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలను ఆశించేవారి నిజమైన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించే బదులు, బలవంతంగా గొంతులను నొక్కే విధానాన్ని ఎంచుకుంటుందని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు.