అందుకే కేటీఆర్ విచారణకు రాలేదు.. కోర్టుకు వివరించిన లాయర్లు
పరువునష్టం కేసులో కేటీఆర్(KTR) పిటిషన్‌పై నాంపల్లి కోర్టు(Nampally court)లో విచారణ జరిగింది.
దిశ, వెబ్‌డెస్క్: పరువునష్టం కేసులో కేటీఆర్(KTR) పిటిషన్‌పై నాంపల్లి కోర్టు(Nampally court)లో విచారణ జరిగింది. వాంగ్మూలం తీసుకుంటామని చెప్పినా మళ్లీ సమయం ఎలా కోరుతారని కోర్టు కేటీఆర్ తరపు లాయర్‌ను ప్రశ్నించింది. కొన్ని అనివార్య కారణాల వల్ల కేటీఆర్ విచారణకు హాజరు కాలేకపోయారని లాయర్లు సమాధానం ఇచ్చారు. సోమవారం లేదా? బుధవారం వరకు సమయం కావాలని కోర్టును లాయర్లు రిక్వెస్ట్ చేశారు. దీంతో బుధవారం వరకు కోర్టు సమయం ఇచ్చింది. బుధవారం కేటీఆర్ స్టేట్మెంట్‌ను రికార్డు చేస్తామని వెల్లడించింది. అనంతరం ఈ కేసును సోమవారానికి వాయిదా వేసింది.
ఇదిలా ఉండగా.. గాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొండా సురేఖ తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ కేటీఆర్ ఈనెల 3న నాంపల్లి క్రిమినల్ కోర్టులో పరువునష్టం కేసు వేశారు. ఈ పిటిషన్‌ను ఈ నెల 14న విచారించిన కోర్టు విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది. కేటీఆర్ సహా సాక్షుల వాంగ్మూలాలను శుక్రవారం(18)న నమోదు చేస్తామని కోర్టు తెలిపింది. ఈ క్రమంలో నేడు కోర్టుకు కేటీఆర్ హాజరుకావాల్సి ఉండగా రాలేదు. దీంతో ఈ కేసును సోమవారం వాయిదా వేశారు.