అశోక్ నగర్లో మరోసారి గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన.. పోలీసుల లాఠీచార్జి

గ్రూప్-1 పరీక్షను రీ షెడ్యూల్ చేయాలని కోరుతున్న అభ్యర్థులు నేడు మరోసారి ఆందోళన బాట పట్టారు.

Update: 2024-10-18 10:59 GMT

దిశ, వెబ్ డెస్క్ : గ్రూప్-1 పరీక్షను రీ షెడ్యూల్ చేయాలని కోరుతున్న అభ్యర్థులు నేడు మరోసారి ఆందోళన బాట పట్టారు. పరీక్షను తేదీలను మార్చాలంటూ అభ్యర్థులు ప్లక్ కార్డ్స్ ప్రదర్శిస్తూ అశోక్ నగర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. పోలీసులు ఆందోళనకారులపై లాఠీ చార్జి చేసి చెదరగొట్టారు. అయినప్పటికీ ఆందోళనకారులు నిరసనలు చేయగా.. వారందరినీ అరెస్ట్ చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా పోలీసుల లాఠీఛార్జీలో పలువురు అభ్యర్థులకు గాయలైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అశోక్ నగర్లో పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది.

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 29 ను రద్దు చేయాలని గత కొద్ది రోజులుగా అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. వికలాంగుల రిజర్వేషన్లకు సంబంధించిన ఈ అంశంపై పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా.. కోర్ట్ విచారణకు నిరాకరించింది. అయినప్పటికీ మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలంటూ అభ్యర్థుల తరఫున న్యాయవాది మోహిత్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో రూల్ ఆఫ్ లా పాటించడం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేయనుంది.  


Similar News