Adani met CM Revanth : సీఎం రేవంత్ రెడ్డితో గౌతమ్ అదానీ భేటీ.. స్కిల్ యూనివర్సిటీ భారీ విరాళం

అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.

Update: 2024-10-18 11:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అదానీ తనను మర్యాదపూర్వకంగా కలిశారని తెలిపారు. ఈ క్రమంలోనే అదానీ ఫౌండేషన్ నుంచి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం చెక్కు రూపంలో అందజేశారని పేర్కొన్నారు.

కాగా, ఈ సమావేశంలో అదానీ గ్రూప్ ఫౌండేషన్ ప్రతినిధులు, సీఎస్ శాంతి కుమారి, ఇతర అధికారులు ఉన్నారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. యూనివర్సిటీ బోర్డు చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రాను నియమించిన సంగతి విదితమే.


Similar News