Talasani Srinivas Yadav : ఇథనాల్ ఫ్యాక్టరీపై తలసాని స్పందన
దిలావర్‌పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ(Dilawarpur Ethanol factory)పై వస్తున్న వార్తలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) స్పందించారు.
దిశ, వెబ్ డెస్క్ : దిలావర్‌పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ(Dilawarpur Ethanol factory)పై వస్తున్న వార్తలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) స్పందించారు. ఆ ఇథనాల్ కంపెనీతో మాకు ఎలాంటి సంబంధం లేదని, కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని తలసాని అన్నారు. ఉన్నతమైన పదవిలో ఉన్నప్పుడు ఎంతో బాధ్యతగా మాట్లాడాలని, ఆరోపణలు చేసేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలని, ఇష్టారీతిన మాట్లాడతాం అంటే సరికాదని హితవు పలికారు. ఒకవేళ ఇథనాల్ కంపెనీలో మాకు భాగస్వామ్యం ఉన్నట్లు రుజువు చేస్తే.. ఆరోపణలు చేస్తున్న పార్టీకి, ఆరోపణలు చేసిన వ్యక్తులకే దానిని అప్పగిస్తానని ప్రకటించారు.