సోషల్‌వర్క్, మెడికల్ ఎడ్యుకేషన్, ఫైన్ అర్ట్స్ రంగాలకు అవార్డులు
ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
దిశ , తెలంగాణ బ్యూరో: ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. క్రిస్మస్ వేడుకల నిర్వహణపై బుధవారం ప్రజాభవన్‌లో భట్టి విక్రమార్క సెలెబ్రేషన్ కమిటీ సభ్యులు, ఉన్నత అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎల్ బి స్టేడియంలో జరిగే క్రిస్మస్ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. సోషల్ వర్క్, మెడికల్, ఎడ్యుకేషన్, లిట్రర్రి, స్పోర్ట్స్, ఫైన్ ఆర్ట్స్ రంగాల్లో అవార్డులకు ఎంపికైన వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా లక్ష రూపాయలు, సోషల్ వర్క్, మెడికల్, ఎడ్యుకేషన్ అవార్డులకు ఎంపికైన సంస్థలకు రెండు లక్షల రూపాయల చెక్కులను అందిస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి ఆనంద్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి తఫ్సీర్ ఎక్బాల్, జీ.ఏ.డి డైరెక్టర్ ఎస్. వెంకట్రావు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కాంతి వెస్లీ, మాజీ ఎమ్మెల్యే క్రిస్టైన్ లాజరస్, క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సబిత, భువనగిరి డి.సి.పి రాజేష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.