కాసేపట్లో తీర్పు.. గ్రూప్ 1 అభ్యర్థుల్లో ఉత్కంఠ..!

తెలంగాణ హైకోర్టులో గ్రూప్ 1 అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి. మరికొద్దిసేపట్లో కోర్టు తీర్పు వెలువరించనుంది.

Update: 2024-10-18 09:00 GMT

దిశ, వెబ్ డెస్క్: గ్రూప్ -1 ప్రిలిమ్స్ పై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. డివిజన్ బెంచ్ లో దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హై కోర్టు (Telangana High Court) విచారణ చేసింది. ఈ పిటిషన్ పై వాదనలు ముగియగా.. మరికాసేపట్లో తీర్పు వెలువడనుంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పునే హైకోర్టు సమర్థిస్తుందా ? లేక గ్రూప్ -1 అభ్యర్థులకు ఊరటనిచ్చేలా తీర్పునిస్తుందా అన్నది కొద్దిసేపట్లో తెలియనుంది. ఈ క్రమంలో గ్రూప్ -1 అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈనెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ఇదిలా ఉండగా.. తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థుల పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలంటూ అభ్యర్థుల తరఫు న్యాయవాది మోహిత్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో రూల్ ఆఫ్ లా పాటించడం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేయనుంది. 


Similar News