TG Inter Exam fee : తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పెంపు
తెలంగాణలో ఇంటర్మీడియట్ 2025 పబ్లిక్ పరీక్షల(Inter Exams) ఫీజు చెల్లింపు గడువు మరోసారి పొడగించింది ఇంటర్ బోర్డ్.
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఇంటర్మీడియట్ 2025 పబ్లిక్ పరీక్షల(Inter Exams) ఫీజు చెల్లింపు గడువు మరోసారి పొడగించింది ఇంటర్ బోర్డ్. రూ.500 ఆలస్య రుసుముతో ఈనెల 31 వరకు ఫీజు చెల్లింపు గడువును పెంచారు. అయితే ఇది డిసెంబర్ 17 వరకే ముగియగా..మరోసారి పొడిగిస్తూ తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యాశాఖ(TSBIE) ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇది ఇంటర్ మొదటి, రెండవ సంవత్సర విద్యార్థులతో పాటు, వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు, ప్రైవేట్ అభ్యర్థులకు కూడా వర్తిస్తుందని బోర్డు స్పష్టం చేసింది.