Bainsa: ఇక్కడి రైతుల పేరిట మహారాష్ట్ర పత్తి విక్రయం
సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించిన తర్వాత రికార్డు స్థాయిలో పత్తి కొనుగోళ్ళు నమోదు అవుతున్నాయి.
దిశ, భైంసా: సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించిన తర్వాత రికార్డు స్థాయిలో పత్తి కొనుగోళ్ళు నమోదు అవుతున్నాయి. ఇక్కడ రైతులు పండించిన పత్తి కంటే దాదాపు 30% పత్తి అధికంగా కొనుగోళ్లు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. మహారాష్ట్ర నుండి తీసుకొచ్చిన పత్తికి తెలంగాణ రైతుల పట్టాలపై పత్తిని జోకి దళారులు తమ జేబులను నింపుకుంటున్నారని స్థానికులు వాపోతున్నారు. మహారాష్ట్ర ఏరియా నుండి క్వింటా రూ. 6800 లేదా 6900 వందలు చెల్లిస్తూ.. ఇక్కడ సీసీఐ ద్వారా దాదాపు రూ. 7500ల మద్దతు ధర పొందుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో నిత్యం బైంసా పట్టణంలో వందలలో ఐచర్ వాహనాలు రాగా దళారులు సొమ్ము చేసుకుంటూ తమ జేబులు నింపుకుంటున్నారు. మహారాష్ట్ర సరిహద్దుగా అనుకొని వున్న గ్రామాలైన బొకర్,నాందేడ్,లోహ ఇలా పలు మహారాష్ట్ర తదితర కేంద్రాల నుంచి పత్తిని నింపుకొని వచ్చి దళారులు దందా చేసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఒకే బండిలో వందల క్వింటాళ్ల పత్తి..!
మహారాష్ట్ర నుండి పెద్ద పెద్ద ఐచర్ వాహనాలలో తీసుకువచ్చిన పత్తి దాదాపు 100 క్వింటాళ్ల పైనే ఉంటుంది. తెలంగాణ రైతులకు సంబంధించి వివిధ ప్రాంతాలలో వున్న రైతుల పట్టా పాస్ బుక్కులు తీసుకొని, దళారులు పత్తి జోకుతున్నారు.అయితే ఒకే వాహనంలోని పత్తిని ఒక రైతు కి సంబంధించి రెండు ఎకరాల పట్టాపై జోకీ, తర్వాత మిగిలి ఉన్న పత్తి వాహనాన్ని తూకంకాంటాపై నుండి జరిపి, మరల అదే వాహనాన్ని కొంత సమయం గ్యాప్ ఇచ్చి మరో రైతుకు సంబంధించి పట్టాపై పత్తిని జోకుతున్నారు. ఇలా ఇక వాహనాన్ని కాంటాపై ఎక్కించి పలుమార్లు ఎక్కించి పూర్తి పత్తిని ఖాళీ చేస్తున్నారు.