ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తాం
ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని ఎమ్మెల్యే వేలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.
దిశ, మామడ : ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని ఎమ్మెల్యే వేలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పోతారం గ్రామం నుంచి తిరుపల్లి గ్రామం వరకు రూ. కోటి 35 లక్షల నిధులతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోతారం గ్రామం నుంచి కొరటికల్ గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి త్వరలో నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాపురెడ్డి, రాజారెడ్డి, మెడిసిమ్మరాజు, చిన్న గౌడ్, రవి తదితరులు పాల్గొన్నారు.