ఆర్టీసీ లాజిస్టిక్స్ కొరియర్ బంద్

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రజల సౌకర్యం కోసం టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ కొరియర్ సేవలను ప్రారంభించారు.

Update: 2024-12-25 13:14 GMT

దిశ, ఖానాపూర్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రజల సౌకర్యం కోసం టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ కొరియర్ సేవలను ప్రారంభించారు. దీని ద్వారా రాష్ట్రంలో ఎక్కడికైనా తమ వస్తువులు సరైన సమయంలో వినియోగదారులకు అందించే వారు. కానీ ఆర్టీసీ సిబ్బంది కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు ఆ కొరియర్ సేవలను అప్పగించడంతో వారు ఇష్టం వచ్చినప్పుడు సేవలను బంధు చేస్తున్నారు.

    నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని బస్టాండ్లో ఉన్న ఆర్టీసీ లాజిస్టిక్స్ కొరియర్ బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరవకపోవడంతో వినియోగదారులు తమకు వచ్చే కొరియర్ కోసం ఆర్టీసీ బస్టాండ్ కు వచ్చి తిరిగి వెళ్తున్నారు. బస్టాండ్ సమీపంలో ఉన్న ఆర్టీసీ అధికారులను కొరియర్​ గురించి అడుగగా తమకు తెలియదని తెలిపారు. ఇకనైనా ఆర్టీసీ సంస్థ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వినియోగదారుల కోరుతున్నారు. 


Similar News