దూడను గాయపరిచింది పులి కాదు...వీధి కుక్కలు...
మండలంలోని నీలాయపల్లి సమీపంలోని లేగదూడ పై దాడి చేసింది పులి కాదని, వీధి కుక్కలే అని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు.
దిశ, తాండూర్ : మండలంలోని నీలాయపల్లి సమీపంలోని లేగదూడ పై దాడి చేసింది పులి కాదని, వీధి కుక్కలే అని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. లేగదూడ గాయపడిన ఘటనా స్థలాన్ని బుధవారం అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పరిశీలించారు. గాయపడిన లేగదూడను తాండూర్ పశువైద్యశాలకు తరలించి వైద్యం చేయించారు. మాదారం టౌన్ షిప్ కు చెందిన దూడ యజమాని రాపల్లి సతీష్ కు లేగదూడను అటవీశాఖ అధికారులు అప్పగించారు. మండలంలో పులి సంచారం లేదని ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు.