BRS: కేటీఆర్ కడిగిన ముత్యంలా వస్తాడు.. మాజీమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిల్లర గేమ్ ఆడుతున్నాడని, ఫార్ములా ఈ కేసు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని మాజీమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Former Minister Vemula Prashanth Reddy) విమర్శించారు.

Update: 2025-01-07 13:49 GMT

దిశ, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిల్లర గేమ్ ఆడుతున్నాడని, ఫార్ములా ఈ కేసు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని మాజీమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Former Minister Vemula Prashanth Reddy) విమర్శించారు. ఫార్ములా ఈ కేసు(Formula E Race)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) నివాసం వద్ద ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government)పై ఫైర్ అయ్యాడు. ఆయన మాట్లాడుతూ.. పాలనలో రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విఫలమయ్యాడని, అందుకే డైవర్షన్ పాలిటిక్స్(Diversion Politics) చేస్తున్నాడని అన్నారు. 15 నెలల క్రితం జరిగిన దానిపై కేసు పెట్టే ప్రయత్నం చేసి ప్రజల దృష్టిని మరల్చాలని చూస్తున్నాడని మండిపడ్డారు.

హైదరాబాద్(hyderabad) బ్రాండ్ పెంచేందుకు కేటీఆర్ ఈ రేస్ తెచ్చారని, ఇది ఒక లొట్టపీసు కేసు.. చెత్త కేసు అని వ్యాఖ్యానించారు. అంతేగాక ఎలాగైనా కేటీఆర్‌ను ఇబ్బంది పెట్టాలని ఈ కేసు పెడుతున్నారని, ఈ రేసు వల్ల గ్రీన్‌కో కంపెనీ నష్టాలను ఎదుర్కున్నదని తెలిపారు. ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ కూడా ఎలక్టోరల్ బాండ్స్ తెచ్చుకుందని చెప్పారు. ఇక సోషల్ మీడియాలో తప్పులు ప్రచారం చేస్తున్నారని, రేవంత్ కుట్రలను ఛేదించి.. కడిగిన ముత్యంలా కేటీఆర్ బయటకు వస్తారని అన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలు మొదలు నాయకుల వరకు ప్రభుత్వంపై పోరాడుతూనే ఉంటామని, లీగల్‌గా ఉన్న అప్షన్స్ ఖచ్చితంగా వాడుకుంటామని, తమకు న్యాయ వ్యవస్థల మీద నమ్మకం ఉందని వేముల స్పష్టం చేశారు.

Tags:    

Similar News