దారుణం.. మూగ బాలికపై సామూహిక అత్యాచార యత్నం

మూగ మైనర్ బాలికపై గుర్తు తెలియని ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచార యత్నానికి ఒడిగట్టారు.

Update: 2023-04-19 08:06 GMT

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్ : మూగ మైనర్ బాలికపై గుర్తు తెలియని ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచార యత్నానికి ఒడిగట్టారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎర్రగడ్డ కాలనీలో బుదవారం తెల్లవారుజామున 2గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితురాలి తల్లిదండ్రుల కథనం మేరకు నాగర్ కర్నూల్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన కుటుంబం బతుకుతెరువు నిమిత్తం నాగర్ కర్నూల్ జిల్లాలో నివాసం ఉంటున్నారు.

మధ్యరాత్రి తమ (15) ఏళ్ల బిడ్డ లేకపోవడంతో కంగారుపడి తల్లిదండ్రులిద్దరూ చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. వెంటనే స్థానికుల సాయంతో డయల్ 100ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా పోలీసులు వచ్చే వరకు తమబిడ్డ ఓ పాడుబడిన హాస్టల్ బంగ్లా నుండి పరుగెత్తుకుంటూ వచ్చిందని తెలిపారు. అక్కడికి వెళ్లి చూసేసరికి దుండగులు పరారయ్యారు. ఉదయం చుట్టుపక్కల వారి ఇళ్లల్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.

కాగా ఆ మైనర్ బాలిక దుండగులు చేసిన అఘాయిత్యం తీరులను తన మూగ సైగల ద్వారా పోలీసులకు వివరించింది. చేతులు కాళ్లు కట్టేసి తాగి పడేసిన సీసాలతో చంపేస్తానంటూ బెదిరించినట్లు పేర్కొంది. అత్యాచారం జరిగిందా లేదా అన్న విషయంలో స్పష్టత రాకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సుమారు రెండున్నర గంటల పాటు తమ పాప దుండగుల చేతిలోనే ఉండడంతో అత్యాచారం జరిగి ఉండొచ్చు అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలిక చిన్నమ్మ ఆ దుండకులకు పాపను అప్పగించినట్లు పాప ఆరోపిస్తోంది. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

Tags:    

Similar News