బీఆర్ఎస్‌కు మరో BIG షాక్.. ఇవాళ కాంగ్రెస్‌లోకి 35 మంది కార్పొరేటర్లు
లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లోని మేయర్ సహా బీఆర్ఎస్ కార్పొరేటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లోని మేయర్ సహా బీఆర్ఎస్ కార్పొరేటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరాలని మేయర్ అనిల్ సహా 20 మంది కార్పొరేటర్లు నిర్ణయం తీసుకున్నారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్‌తో కలిసి మేయర్, కార్పొరేటర్లు అందరూ గాంధీభవనకు వెళుతున్నారు.
కాగా, అయితే, పెద్దపెల్లి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో బీఆర్ఎస్ అధినేత, మాజీ కేసీఆర్ సమావేశం నిర్వహించనున్న ఇవాళే కార్పొరేటర్లు షాక్ ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరోవైపు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్‌కు అనూహ్య పరిణామం ఎదురైంది. 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు, మరో 15 మంది బీఆర్ఎస్ కీలక నాయకులు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఈ మేరకు ఆదివారం కొండా దంపతులతో భేటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.