క్షయ వ్యాధిగ్రస్తులు సమయానికి మందులు వాడాలి
క్షయ వ్యాధితో బాధపడుతున్నవారు వ్యాధి నయం కావాలంటే సమయానికి మందులు, పోషణ అవసరం అని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
దిశ, ఆదిలాబాద్ : క్షయ వ్యాధితో బాధపడుతున్నవారు వ్యాధి నయం కావాలంటే సమయానికి మందులు, పోషణ అవసరం అని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో టీబీ నియంత్రణ కోసం చేపట్టిన వంద రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం ఆదిలాబాద్ రూరల్ లోని అంకోలి పీహెచ్ సీలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీబీ పేషెంట్ లకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా నీక్షయ పోషణ్ కిట్స్ ను అందజేశారు. అంకోలి పీహెచ్సీ పరిధిలో 125 టీబీ కేసులు ఉండగా శనివారం గ్లాండ్ ఫార్మా ప్రతినిధులు కెప్టెన్ రఘురామన్, గిరీష్, సుబ్బరాజు, లోక భారతి ట్రస్ట్ నుండి కుమారన్ లు కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్షయ వ్యాధిగ్రస్తులు తమ ఆరోగ్యం నిలబెట్టు కోవాలంటే సరైన సమయంలో మందులతో పాటు పోషకాహారం ఎంతో అవసరమని సూచించారు. ఆరు నెలల పాటు ప్రతి నెలా ఈ కిట్ ఇవ్వడం జరుగుతుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా. నరేందర్ రాథోజ్, అదనపు డి ఎంహెచ్ ఓ డా.మనోహర్, డీటీసీఓ డా.సుమలత, డీఈపీ డా.సాధన, పీ ఓ ఎన్సీడీ డా.శ్రీధర్, డీఎల్ ఓ డా. గజానంద్, అంకోలి ఎంఓ డా.ఆశకిరణ్, డా.సర్ఫరాజ్, టీబీఎంఓ డా. సాయి ప్రియ, షిరిన్, అంకోలీ పీహెచ్సీ స్టాఫ్ పాల్గొన్నారు.