పది పరీక్షలకు మేము సైతం..
ముధోల్ నియోజకవర్గం లోని వివిధ మండలాల్లో పదో తరగతి పరీక్షలు

దిశ,భైంసా : ముదోల్ నియోజకవర్గం లోని వివిధ మండలాల్లో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి.భైంసా పట్టణ కేంద్రంలో ఓ పరీక్ష కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మెట్లు ఎక్కి రూమ్ కు చేరుకునే విషయంలో సిబ్బంది వాళ్ళను తమ భుజాలపై ఎక్కించుకుని రూమ్ లో దిగబెట్టారు. మరో దివ్యాంగుడు రాయలేని స్థితిలో ఉండగా వారికి ఆల్టర్నేట్ గా దివ్యాంగుడు డిక్టేషన్ రూపంలో చెప్తే రాసే వారిని సైతం ఏర్పాటు చేయమన్నారు. శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మొదటి పరీక్ష తెలుగు కాగా,విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీసులు పరీక్ష కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి సకాలంలో రావాలని ఇప్పటికే అధికారులు సూచించిన విషయం తెలిసిందే.
