మాస్ కాపీయింగ్ లేకుండా పరీక్షలు రాయాలి

పదవ తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థులు మాస్​కాపీయింగ్​కు తావు లేకుండా కష్టపడి చదివి పరీక్షలు రాయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.

Update: 2025-03-22 11:47 GMT
మాస్ కాపీయింగ్ లేకుండా పరీక్షలు రాయాలి
  • whatsapp icon

దిశ, ఆదిలాబాద్ : పదవ తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థులు మాస్​కాపీయింగ్​కు తావు లేకుండా కష్టపడి చదివి పరీక్షలు రాయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఈనెల 21న పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కాగా రెండవ రోజు శనివారం జిల్లా కలెక్టర్ ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యాపలగూడ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షల కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

    తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులను పరిశీలించిన ఆయన ఎటువంటి మాస్ కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా పరీక్షలు రాయాలని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను పరిశీలించిన ఆయన పరీక్ష కేంద్రంలో అన్ని వసతులు అందుబాటులో ఉండాలని నిర్వాహకులకు సూచించారు. 


Similar News