ఇంద్రవెల్లి మండలంలో విలీనం చేసినందుకు సీతక్క కు ధన్యవాదాలు : ఖానాపూర్ ఎమ్మెల్యే
రాష్ట్ర విభజన అనంతరం మల్లాపూర్ గ్రామం ఇంద్రవెల్లి మండలం నుండి

దిశ, ఇంద్రవెల్లి : రాష్ట్ర విభజన అనంతరం మల్లాపూర్ గ్రామం ఇంద్రవెల్లి మండలం నుండి సిరికొండ మండలంలో గత ప్రభుత్వం కల్పించిన, దీంతో ఆ గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఆనాటి జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్, తాను పిసా కో ఆర్డినేటర్ హోదాలో ఉన్న సమయంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు.నేడు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ గ్రామ ప్రజల సమస్యను జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్క గుర్తించి మల్లాపూర్ గ్రామాన్ని మళ్ళీ ఇంద్రవెల్లి మండలం లో విలీనం చేయడంతో పాటు ఉట్నూర్ మండలంలోని సాకేర(జే) గ్రామం పేరు తప్పుగా జమాల్ నాయక్ తండా నమోదు అయిందని,మళ్ళీ ఆ గ్రామ పేరును సాకేర(జే)గా మార్చడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఇంద్రవెల్లి,ఉట్నూర్ ప్రజల తరఫున జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.