ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదు.. : ఆదిలాబాద్ ఎమ్మెల్యే

రెండు రోజుల క్రితం కురిసిన వడగళ్ల వాన వల్ల రాష్ట్రంలో ఉన్న రైతులు

Update: 2025-03-24 13:33 GMT
ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదు.. : ఆదిలాబాద్ ఎమ్మెల్యే
  • whatsapp icon

దిశ, ఆదిలాబాద్ : రెండు రోజుల క్రితం కురిసిన వడగళ్ల వాన వల్ల రాష్ట్రంలో ఉన్న రైతులు నష్టపోయారని, ఈ పరిస్థితిని వివరిద్దామని, పంటలను తీసుకొచ్చి మీడియా పాయింట్ లో చూయించి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్దాం అనుకుంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం సెక్యూరిటీ వాళ్ళని అడ్డం పెట్టి మమ్మల్ని అడ్డుకోవడం సమంజసం కాదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని, పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం అసెంబ్లీ ముందర నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ తో పాటు పాల్వాయి హరీష్ బాబు, వెంకట రమణారెడ్డి, ధనపాల్ సూర్యనారాయణ, రామారావు పటేల్ తదితరులు ఉన్నారు. ఇది ఇలా ఉంటే శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కొమరం భీం కాలనీలో నివసిస్తున్న ఆదివాసుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేయగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే స్పందించారు. ఈ మేరకు అసెంబ్లీ సమావేశంలో ఆదిలాబాద్ పట్టణంలో కొమురం భీం కాలనీ లో నివసిస్తున్న టువంటి ఆదివాసీలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.



 


Similar News