పండుగలు మతసామరస్యానికి ప్రతీకలు
బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీ రాజ్ అధికారుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు.

దిశ ప్రతినిధి, నిర్మల్ : బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీ రాజ్ అధికారుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్ లతో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. వివిధ జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి విందును స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలంతా అన్ని పండుగలను కలిసికట్టుగా సహోదర భావంతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని మతాల సారం ఒకటేనని, ప్రజలంతా కలిసికట్టుగా ఉంటూ దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు. సమాజ సేవ, దయాగుణం వంటి మంచి లక్షణాలను అలవర్చుకోవాలని తెలిపారు. ముస్లింలకు ముందస్తు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రత్న కళ్యాణి, జిల్లా అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.