బైంసా రూరల్ పోలీస్ స్టేషన్‌ని ప్రతి పోలీస్ స్టేషన్ ఆదర్శంగా తీసుకోవాలి : ఎస్పీ జానకి షర్మిల
భైంసా రూరల్ పోలీస్ స్టేషన్ ని ప్రతి స్టేషన్ ఆదర్శంగా తీసుకుని ముందుకు

దిశ,భైంసా : భైంసా రూరల్ పోలీస్ స్టేషన్ ని ప్రతి స్టేషన్ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. శుక్రవారం వార్షిక తనిఖీలలో భాగంగా బైంసా రూరల్ స్టేషన్ పరిసరాలను, రికార్డులను చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఏఎస్పీ అవినాష్ కుమార్,స్థానిక సీఐ నైలు, ఎస్సై లను అభినందించారు.అయితే ఎస్పీకి రూరల్ పోలీసులు గౌరవ వందనం చేసి, పుష్పగుచ్చం తో స్వాగతం పలికారు. అనంతరం మొక్కలను నాటారు.ప్రతి ఒక్క పోలీసు విధులలో నిబద్ధత చూపించాలని అన్నారు.