ఒక వైపు తండ్రి మరణం.. మరో వైపు పది పరీక్ష.. పుట్టెడు దుఃఖంతో..
విధి వంచించింది.. అవే ఆమెకు పదవ తరగతి చివరి పరీక్షలు అలాంటి

దిశ, కన్నెపల్లి : విధి వంచించింది.. అవే ఆమెకు పదవ తరగతి చివరి పరీక్షలు అలాంటి దుర్భర సమయంలో తండ్రిని కోల్పోయి ఓ విద్యార్థి పుట్టేడు దుఃఖంతో దిగమింగుతూ పదో తరగతి పరీక్ష రాసిన సంఘటన కన్నెపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కన్నెపల్లి మండలంలోని ముత్తాపూర్ కి చెందిన మంచర్ల శ్రీలత కన్నెపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఆమె తండ్రి మంచర్ల మల్లయ్య అనారోగ్యంతో గురువారం మృతి చెందాడు. శుక్రవారం నుంచి ఆమెకు పదో తరగతి పరీక్షలు ఉండటంతో ఆమె తన తండ్రిని కోల్పోయిన పుట్టెడు దుఃఖాన్ని మనసులో ఉంచుకొని నిరుపేద కుటుంబంలో జన్మించిన శ్రీలత మనోధైర్యాన్ని పెంపొందించుకొని చదువుపై ఆమెకు ఉన్న మక్కువతో ఓవైపు తండ్రి అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే ఆమె పదో తరగతి మొదటి రోజు తెలుగు పరీక్షకు హాజరైంది. ఆమె మనోధైర్యం చూసి మండల విద్యాధికారి రాము, ప్రధానోపాధ్యాయులు రమేష్, ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, ఆమెను అభినందించారు.