విపత్తు సమయంలో అండగా ఉండాలి

విపత్తు సంభవించినప్పుడు స్థానికంగా ఉండే యువత, అధికారులు స్పందించి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అందించే శిక్షణలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు.

Update: 2025-03-20 14:02 GMT
విపత్తు సమయంలో అండగా ఉండాలి
  • whatsapp icon

దిశ, ఆదిలాబాద్ : విపత్తు సంభవించినప్పుడు స్థానికంగా ఉండే యువత, అధికారులు స్పందించి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అందించే శిక్షణలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ తరపున ఆపదమిత్ర పేరుతో టీటీడీసీలో ఈనెల 17 నుంచి 29వ తేదీ వరకు నిర్వహిస్తున్న శిక్షణను కలెక్టర్ గురువారం సందర్శించారు. శిక్షణకు వస్తున్న గ్రామ, మండల స్థాయి అధికారులతో పాటు యువకులతో మాట్లాడారు. శిక్షణ అందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన శిక్షణను అందించాలని సిబ్బందికి సూచించారు. వారం రోజుల పాటు ఆయా శాఖల అధికారులు విపత్తు సమయంలో అనుసరించే విధానాలు, ప్రాణాలు ఎలా కాపాడాలో వివరించారు.

     ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విపత్తు సమయంలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ రావడానికి సమయం పడుతుందన్నారు. ఆ సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా స్థానికంగా ఉండే వారిని ఎంపిక చేసి శిక్షణ అందిస్తున్నామనీ తెలిపారు. పంచాయతీరాజ్, ఇరిగేషన్, రెవెన్యూ, సివిల్ సప్లయి, పంచాయతీ కార్యదర్శులు, యువకులు నిత్యం వంద మందికి శిక్షణ ఇస్తున్నామనీ తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో విపత్తులు సంభవించిన సమయంలో వినియోగించాలని సూచించారు. అదే విధంగా ఎండాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ప్రజలకు తెలియజేయాలన్నారు. అగ్ని ప్రమాదాలపై ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమలో డీఆర్డీఓ రాథోడ్ రవీందర్, డీవైఎస్ఓ వెంకటేశ్వర్లు, వైద్యులు డాక్టర్ హరీష్, యు.స్వామి, సిబ్బంది ప్రభాకర్​స్వామి, మహేందర్ పాల్గొన్నారు. 


Similar News