నీచ రాజకీయాలకు కేరాఫ్ ఆ ఎమ్మెల్యే.. : జోగు రామన్న

గత మంత్రిగా రాష్ట్ర అభివృద్ధి పై చిత్తశుద్ధితో పనిచేశానే తప్పా నీచ

Update: 2025-03-17 08:28 GMT
నీచ రాజకీయాలకు కేరాఫ్ ఆ ఎమ్మెల్యే.. : జోగు రామన్న
  • whatsapp icon

దిశ, ఆదిలాబాద్.: గత మంత్రిగా రాష్ట్ర అభివృద్ధి పై చిత్తశుద్ధితో పనిచేశానే తప్పా నీచ రాజకీయాలకు ఎప్పుడు పాల్పడలేదని,కానీ ఆదిలాబాద్ ఎమ్మెల్యే నీచ రాజకీయాలు ప్రజలందరికీ తెలుసని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సీసీఐ,ఎయిర్ పోర్ట్ ఏర్పాటు విషయంలో తనపై చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ ఎమ్మెల్యే తీరుపై ఫైర్ అయ్యారు. బిజెపి జిల్లా అధ్యక్షుడిగా ఉండి పాయల శంకర్, సుహాసిని రెడ్డి లు రైతులను రెచ్చగొడుతూ నీచ రాజకీయాలు చేశారని సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మండిపడ్డారు.

పార్లమెంటు సమావేశాల్లో సీసీఐ పరిశ్రమ తుక్కు మాత్రమే విక్రయిస్తున్నామని, పరిశ్రమను కాదని ఆ శాఖకు చెందిన కేంద్ర మంత్రి తో ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు.జోగు రామన్న అబద్ధాలు ఆడకుండా నాలుగు సార్లు గెలిచారని పేర్కొన్నారు. గతంలో ఎంపీ నగేష్, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, లతో కలిసి బిజెపి కేంద్ర మంత్రులు హంస రాజ్ గంగారం,అనంత్ గీతేలను కలిసి సీసీఐ పునఃప్రారంభం దిశగా కృషి చేయడం జరిగిందన్నారు.

ఈ మార్చి 7న టెండర్లను అఖిలపక్ష సమావేశాలతో నిలదీసి టెండర్లను ఆపడం జరిగిందని పేర్కొన్నారు.అలాగే రేణుక సిమెంట్ పరిశ్రమ భూ నిర్వాసితులకు అప్పట్లో 30 నుంచి 40 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన అప్పటి బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ నేడు ఎమ్మెల్యేగా గెలిచి భూ నిర్వాసితులకు 30 నుంచి 40 లక్షలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. ఇకనైనా బీజేపీ నాయకులు నీచ రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు.కాగా బీజేపీ పార్టీ గుర్తింపు ఉండదని భావించి బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి ఆయన కండువా వేసి స్వాగతం పలికారు.ఈ సమావేశంలో నాయకులు ఇజ్జగిరి నారాయణ, కుమ్రా రాజు, కొండ గణేష్, కోవా రవి, నల్ల మహేందర్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.


Similar News