పెద్దబుగ్గ అడవిలో చెలరేగిన మంటలు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెద్దబుగ్గ అడవిలో మంగళవారం రాత్రి కారు చిచ్చు చెలరేగింది.

Update: 2025-03-18 16:34 GMT
పెద్దబుగ్గ అడవిలో చెలరేగిన మంటలు
  • whatsapp icon

దిశ,బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెద్దబుగ్గ అడవిలో మంగళవారం రాత్రి కారు చిచ్చు చెలరేగింది. అడవిలో ఉవ్వెత్తున మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. టేకు, ఇతర చెట్లకి మంటలంటుకున్నాయి. వారం రోజులుగా భారీగా పగటి పూట ఉష్ణో గ్రతలు పెరిగి పోవడం, దానికి తోడు అడవిలో చెట్ల ఆకులు ఎండిపోవడం,పెద్దఎత్తున గాలి ఉండడంతో మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని అడవిలో మంటలు చెలరేగకుండా అధికారులు నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. 


Similar News