పెట్రోల్ ధరలకు సజ్జనార్ సొల్యూషన్.. ఏం చెప్పారంటే?
దిశ, డైనమిక్ బ్యూరో: రోజురోజుకూ పెరుగుతోన్న పెట్రో ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. ఈ కారణంతో సొంత వాహనంలో బయటకు వెళ్లడానికి ప్రజలు జంకుతున్నారు. గతంలో పెట్రోల్ కోసం నెలలో రూ.3 వేలు వెచ్చించాల్సి వచ్చేది. అదే ఇప్పుడు రూ.4 వేలు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, ఈ విషయంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. పెరిగిపోతోన్న ధరల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజారవాణా ఆర్టీసీని వినియోగించాలని పిలుపునిచ్చారు. అంతేగాకుండా వివిధ […]
దిశ, డైనమిక్ బ్యూరో: రోజురోజుకూ పెరుగుతోన్న పెట్రో ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. ఈ కారణంతో సొంత వాహనంలో బయటకు వెళ్లడానికి ప్రజలు జంకుతున్నారు. గతంలో పెట్రోల్ కోసం నెలలో రూ.3 వేలు వెచ్చించాల్సి వచ్చేది. అదే ఇప్పుడు రూ.4 వేలు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, ఈ విషయంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. పెరిగిపోతోన్న ధరల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజారవాణా ఆర్టీసీని వినియోగించాలని పిలుపునిచ్చారు. అంతేగాకుండా వివిధ అవసరాల కోసం హైదరాబాద్‌కు వచ్చేవారు నగరంలోని పలు ప్రాంతాలు తిరగాల్సి వస్తుంది.
అయితే, అలాంటి వారు టీ-24 టికెట్‌ను వినియోగించుకోవాలని సూచించారు. టీఎస్ఆర్టీసీ విద్యార్థులకు, పర్యాటకుల కోసం తీసుకొచ్చిన టీ-24 టికెట్ ఎంతో ఉపయోగకరంగా మారింది. ముఖ్యంగా నగరంలోని పర్యాటక ప్రాంతాలను పర్యటించేందుకు ఎక్కువగా దీనిని వినియోగిస్తుంటారు. దీని ద్వారా తక్కువ రేటుతో నగరాన్ని ఈజీగా చుట్టేయొచ్చు. ఈ టికెట్ బస్సు కండక్టర్ వద్ద లభిస్తుంది. దీనిలో రెండు రకాలు ఉంటాయి. ఏసీ టికెట్ ధర రూ.160, మెట్రో టికెట్ ధర రూ.80 గా ఉంది. దీంతో లీటర్ పెట్రోల్ కంటే తక్కువ ధరతో టికెట్ కొనుక్కొని హైదరాబాద్‌ను వీక్షించండి అంటూ ఎండీ సజ్జనార్ ప్రజలకు పిలుపునిచ్చారు.
కోడి ముందా, గుడ్డు ముందా.. హమ్మయ్య ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది!
Travel in #TSRTC Safely with less cost#sundayvibes @urstrulyMahesh @puvvada_ajay @Govardhan_MLA @RGVzoomin @DarshanDevaiahB @HUMTA_hmdagov @airnews_hyd @maheshbTOI @balaexpressTNIE @V6_Suresh @PranitaRavi @baraju_SuperHit @abntelugutv @AbhiramNetha @iAbhinayD @Telugu360 @TSRTCHQ pic.twitter.com/hvQVZytMNe
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) October 31, 2021