MP Eatala: కాంగ్రెస్ దిగజారి మాట్లాడుతోంది.. ఎంపీ ఈటల కీ కామెంట్స్

లోక్‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్‌ (Delimitation)పై ప్రాంతీయ పార్టీలా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ దిగజారి మాట్లాడుతోందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (MP Etala Rajender) ఫైర్ అయ్యారు.

Update: 2025-03-22 06:57 GMT
MP Eatala: కాంగ్రెస్ దిగజారి మాట్లాడుతోంది.. ఎంపీ ఈటల కీ కామెంట్స్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్‌ (Delimitation)పై ప్రాంతీయ పార్టీలా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ దిగజారి మాట్లాడుతోందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (MP Etala Rajender) ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌ (Hyderabad)లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీలిమిటేషన్‌ (Delimitation)పై కేంద్ర ప్రభుత్వం (Central Government) ఎక్కడ అధికారిక ప్రకటన చేయలేదని, అందుకు ఎలాంటి విధివిధానాలను (Procedures) కూడా ఖరారు చేయలేదని అన్నారు. అఖిలపక్ష భేటీతో విపక్షాలు ఈ విషయంలో లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు.

డీలిమిటేషన్‌తో తెలంగాణ రాష్ట్రం (Telangana State)లో ఎంపీ సీట్లు తగ్గుతాయని జరగుతోన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని అన్నారు. సీట్లు పెరిగే అవకాశం ఉండొచ్చు కానీ, తగ్గే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు. ఎవరూ అలాంటి అపోహాలు పెట్టుకోవద్దని విపక్షాలకు హితవు పలికారు. నియోజకవర్గాల పునర్విభజనకు ప్రాతిపాదిక ఏంటనే విషయం ఇంకా తేలాల్సి ఉందని అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్‌తో పాటు విపక్షాలు చేస్తున్న హడావుడిని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని కామెంట్ చేశారు. పిల్ల పుట్టక ముందే.. కుల్ల కుట్టినట్లుగా వారి తీరు ఉందంటూ సెటైర్లు వేశారు. బీజేపీ (BJP) దేశం కోసం ఆలోచించే పార్టీ అని.. ప్రొగ్రెస్సివ్‌ (Progressive)గా ముందంజలో ఉన్న రాష్ట్రాలను మరింత అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వ (Central Government) పాలన కొనసాగుతోందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. 

Tags:    

Similar News