Bandi Sanjay: బీజేపీ అధ్యక్ష పదవిపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ బీజేపీ (Telangana BJP)కి కొత్త అధ్యక్షుడి నియామకంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది.

Update: 2025-03-22 08:22 GMT
Bandi Sanjay: బీజేపీ అధ్యక్ష పదవిపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ (Telangana BJP)కి కొత్త అధ్యక్షుడి నియామకంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రాష్ట్ర అధినాయకత్వం బూత్ స్థాయి నుంచి జిల్లా అధ్యక్షుల ఎంపిక ప్రక్రియను కూడా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) రాష్ట్ర అధ్యక్ష పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ ప్రెసిడెంట్ (BJP President) రేసులో లేనని.. ఒకవేళ ఇచ్చినా తిరస్కరించబోనని అన్నారు. అధ్యక్షుడిగా తానేంటో ఇప్పటికే నిరూపించుకున్నానని తెలిపారు. కొంతమంది తామే అధ్యక్షుడినంటూ ప్రచారం చేసుకుంటున్నారని, అలా చేసుకోవడం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లేనని కామెంట్ చేశారు. ముఖ్యంగా ఎవరూ కార్యకర్తలను కప్ఫ్యూజ్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో ఉన్న వాళ్ల పేర్లు.. అసలు రేసులో ఉండబోవని స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్ర నాయకత్వం చాలా సీరియస్‌‌గా ఉందని అన్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా.. అంతా కట్టుబడి ఉండాలని నాయకులు, కార్యకర్తలకు పిలునిచ్చారు.  

Tags:    

Similar News