పాతబస్తీ అభివృద్దికి కృషి చేస్తాం : మంత్రి శ్రీధర్​బాబు

గత ప్రభుత్వంలో మన ఊరు మన బడి పథకంలో పెద్ద కుంభకోణం జరిగిందని, అది కాళేశ్వరం కంటే పెద్దగా ఉందని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్​ఓవైసీ పేర్కొన్నారు.

Update: 2025-03-25 16:53 GMT
పాతబస్తీ అభివృద్దికి కృషి చేస్తాం : మంత్రి శ్రీధర్​బాబు
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో : గత ప్రభుత్వంలో మన ఊరు మన బడి పథకంలో పెద్ద కుంభకోణం జరిగిందని, అది కాళేశ్వరం కంటే పెద్దగా ఉందని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్​ఓవైసీ పేర్కొన్నారు. మన ఊరు మన బడిలో ఎక్కడ పనులు జరగలేదని, జరిగిన వాటికి నిధులు విడుదల చేయలేదని, విద్యార్థులకు సరఫరా చేసే బెంచీల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ఈ కుంభకోణంపై ప్రశ్న వేద్దామని అనుకుంటే ప్రశ్నోత్తరాలు రద్దు చేశారని పేర్కొన్నారు. రూ. 14 వేల నుంచి రూ. 18 వేల వరకు కొన్నారని, మార్కెట్​లో రూ. 5 వేలకు ఒక బెంచ్​వస్తుందని అంత మొత్తం పెట్టి ఎందుకు కొనుగోళు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈస్కామ్​పై ప్రభుత్వం విచారణ చేయించాలని, తాను ప్రస్తుతం వారి పేర్లు చెప్పలేననని, కాళేశ్వరానికి మించి స్కామ్​జరిగి నిధులు పక్కదారి పట్టాయన్నారు. 32 లక్షల బెంచీలు కొనుగోలు చేసి, దానికి సంబంధించిన నాయకుడు అప్పడు బీఆర్​ఎస్​లో ఉన్నారని ఇప్పడు అదికార పార్టీలో ఉండి తన అవినీతి బయట పడకుండా కాపాడుకున్నాడని ఆరోపించారు. అదే విధంగా రేవంత్​రెడ్డి అధికారం చేపట్టిన తరువాత పాతబస్తీలో ఉన్న హైకోర్టు, సెట్విన్​కేంద్రాలను తరలించే ప్రయత్నం చేస్తున్నారని, అదేవిధంగా రోడ్డు నిర్మాణాలు సరిగా లేవని మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు అక్కడ ప్రజలకు సక్రమంగా అందడం లేదన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో దివంగత వైఎస్​ఆర్​కు లాంటి లీడర్​లేడు : ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత వైఎస్. రాజశేఖర్​రెడ్డి లాంటి డైనమిక్​లీడర్ ఎవరు లేరన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో ఆయనకు మించిన నాయకుడు కనిపించడంలేదన్నారు. ఆయనను నేటి పాలకులు ఆదర్శంగా తీసుకొని పాలన చేస్తే రాష్ట్రం మరింత అభివృద్ది అవుతుందని సూచించారు. పాతబస్తీ అభివృద్దిలో వైఎస్​ఆర్​పాత్ర మరువలేనిదని, ఇప్పటికి అక్కడ ప్రజలు ఆయనను గుర్తు చేశారని తెలిపారు.

తెలంగాణలో ఓల్డ్​సీటీ ఒరిజినల్​సిటీ : మంత్రి శ్రీధర్​బాబు

పాతబస్తీ అభివృద్దిపై గత పాలకులు నిర్లక్ష్యం చేశారని తాము ఓల్డ్​సిటీని ఒరిజినల్​ సిటీ బావిస్తున్నామని, అక్కడ ఉన్న హెరిటెడ్​కట్టడాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని అక్బరుద్దీన్​ప్రశ్నకు మంత్రి శ్రీధర్​బాబు సమాధానమిచ్చారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రహదారుల నిర్మాణాలు చేపడుతామని, మౌలిక వసతుల కల్పనకు త్వరలో చర్యలు చేపడుతామని చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ చేసేందుకు ప్లాన్​చేస్తున్నామని తెలిపారు.

Tags:    

Similar News