స్కూళ్ల మూసివేతపై ఎమ్మెల్సీ కవిత హాట్ కాంమెట్స్

స్కూళ్ల మూసివేతపై శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత హాట్ కాంమెట్స్ చేశారు...

Update: 2025-03-26 16:43 GMT
స్కూళ్ల మూసివేతపై ఎమ్మెల్సీ కవిత హాట్ కాంమెట్స్
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో విద్యా వికాసానికి కేసీఆర్ పునాది వేశారని పాఠశాలలు మూతపడ్డాయని కాంగ్రెస్ నాయకులు చెప్పడం దారుణమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. శాసనమండలిలో విద్యా వ్యవస్థ చర్చపై బుధవారం ఆమె మాట్లాడారు. రాష్ర్టంలో ప్రైవేటు పాఠశాలలో ఫీజుల నియంత్రణ అవసరమేనని కాని ఆ వంకతో గోంతు నోక్కాలని చూస్తున్నారని అన్నారు. ఫలితంగా లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులకు గురవుతారని అన్నారు. ప్రైవేటు స్కూ్ళ్లను మూసివేస్తే నడిపే సత్తా ఈ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. ఇంటిగ్రెటెడ్ పాఠశాలలను కేవలం కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకే ఇస్తారా , మిగతా తెలంగాణతో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడేటప్పడికి 29,268 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, 2023-24 నాటికి సంఖ్య 30,022కు పెరిగిందని మరి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పాఠశాలను ఎక్కడ మూసేసినట్లు అని ప్రశ్నించారు. ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలను నడిపించారన్నారు. ఉన్నత విధ్యలో 35 శాతంలో జాతీయ అగ్రగామిగా నిలిపామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం బకాయి పెట్టిపోయిన రూ.3 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో రూ. 24 వేల కోట్ల మేర ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం నిధులు ఖర్చు చేశాం అన్నారు. తెలంగాణ గురుకులాల్లో చదివిన 94మందికి డీల్లీ ఐఐటీలో సీట్లు వచ్చాయిని , మీ హయంలో 84మంది విద్యార్థులు గురుకులాల్లో చనిపోయారని ఆరోపించారు. నిజంగా మంచి కోసం విద్యా కమిషన్ పనిచేస్తే గత 60 సంవత్సరాల చరిత్ర తీయాలన్నారు. చిత్తశుద్ధి లేనప్పుడు ఈ కమిషన్లు ఎందుకు అని ప్రశ్నించారు. విద్యా కమిషన్ పాఠశాలను మూసివేయవద్దని కమిషన్ చెప్పినా 1913 స్కూళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం మూసివేసిందన్నారు.

కవిత వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి సమాధానం..

బీఆర్ఎస్ హయంలో విద్యాశాఖ కు ఎంత చేయాలో అంతా చేయలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యాలకు సమాధానం ఇచ్చారు. రాష్ర్ట వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలో 16లక్షల మంది విద్యార్థులు ఉన్నారని అన్నారు. వారి సంక్షేమానికి పాటు పడుతున్నామని , వారిని ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులను ఫీజుల రూపంలో నిలువుదోపిడికి పాల్పడుతున్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో సరిపడా ఉపాధ్యాయులు ఉన్నారని ప్రైవేటు ధీటుగా నడుపుతామని సమాధానం ఇచ్చారు. బీఆర్ ఎస్ 10 సంవత్సారాల కాలంలో విద్యాశాఖకు 7శాతం ఖర్చు చేసిన లక్ష కోట్లు విద్యాశాఖకు వచ్చేవని అన్నారు.

Similar News