CM Stalin: ఈ దేశం ఎవరి సొత్తు కాదు.. బీజేపీపై సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
లోక్‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ (Delimitation)లో భాగంగా దక్షిణాది రాష్ట్రాల (South States)కు తీరని అన్యాయం జరుగుతోందనే వాదనలకు బలం చేకూరుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ (Delimitation)లో భాగంగా దక్షిణాది రాష్ట్రాల (South States)కు తీరని అన్యాయం జరుగుతోందనే వాదనలకు బలం చేకూరుతోంది. ఈ నేపథ్యంలోనే డీలిమిటేషన్ (Delimitation)పై చర్చించేందుకు తమిళనాడు (Tamilnadu)లో అధికార డీఎంకే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం (All-Party Meeting) కాసేపటి క్రితం ప్రారంభమైంది. చెన్నై (Chennai)లోని హోటల్ ఐటీసీ చోళ (ITC Chola)లో సీఎం ఎంకే స్టాలిన్ (CM Stalin) అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది. ఈ అఖిలపక్ష భేటీకి తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud), బీఆర్ఎస్ (BRS) నుంచి కేటీఆర్ (KTR), మాజీ ఎంపీ వినోద్ (Vinod) పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే సమావేశంలో సీఎం స్టాలిన్ (CM Stalin) మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాలను అణచివేసేందుకు బీజేపీ (BJP) కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో కొనసాగుతోన్న బీజేపీ (BJP)తో వివిధ రాష్ట్రాల సంస్కృతి, గుర్తింపు, ప్రగతి, సామాజిక న్యాయం లాంటి అంశాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆగ్రహం వ్యకం చేశారు. మన రాష్ట్రాలకు సంబంధించి ఇతరులు నిర్ణయం తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం (Central Government) విధానాలు దక్షణాది రాష్ట్రాల ప్రజల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. డీలిమిటేషన్ (Delimitation)తో సౌత్ స్టేట్స్ (South States) తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. జనాభా ఆధారిత పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు చట్టాల రూపకల్పనలో ప్రాతినిధ్యం తగ్గుతుందని. రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులం అవుతామని అన్నారు. డీలిమిటేషన్‌కు తాము వ్యతిరేకం కాదని.. న్యాయబద్ధంగా, క్రిస్టల్ క్లియర్‌గా పునర్విభజన ప్రక్రియ చేపట్టాలనే తాము డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజల పోరాటం ఫలితంగా దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని.. దేశం ఎవరి సొత్తు కాదని సీఎం స్టాలిన్ ధ్వజమెత్తారు.