Raja Singh: అలా చేస్తేనే అధికారంలోకి వస్తాం.. సొంత పార్టీపై రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్
రాష్ట్ర కొత్త అధ్యక్షుడిపై బీజేపీ (BJP) అధిష్టానం ప్రకటన చేయబోతున్న వేళ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర కొత్త అధ్యక్షుడిపై బీజేపీ (BJP) అధిష్టానం ప్రకటన చేయబోతున్న వేళ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే తెలంగాణ (Telangana) కొత్త బీజేపీ అధ్యక్షుడు రాబోతున్నారని తెలిపారు. కానీ, ప్రెసిడెంట్ (President)ను స్టేట్ కమిటీ (State Committe)నే డిసైడ్ చేస్తే.. ఆయన ఓ రబ్బర్ స్టాంప్ (Rubber Stamp)లానే ఉంటారని కామెంట్ చేశారు. అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా.. అది సెంట్రల్ కమిటీ (Central Committer)నే నిర్ణయించాలని కోరారు. గతంలో కొంతమంది గ్రూపిజం కారణంగా పార్టీకి తీరని నష్టం జరిగిందని కామెంట్ చేశారు. కొందరు మంచి నాయకులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేల చేతులను కట్టేశారని ఆరోపించారు. ఫ్రీ హ్యాడ్ ఇస్తేనే రాబోయే ఎన్నికల్లో రాష్ట్రం (Telangana State)లో బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. అదేవిధంగా కొత్త ఎన్నికయ్యే అధ్యక్షుడు కూడా సీక్రెట్ మీటింగ్స్ పెట్టొద్దని.. ధర్మం గురించి పని చేసే వారికి మాత్రమే ప్రథమ ప్రాధాన్యతను ఇవ్వాలని స్పష్టం చేశారు.