భద్రాచలం బ్రహ్మోత్సవాలకు రండి.. CM రేవంత్‌ను ఆహ్వానించిన మంత్రి

భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు(Bhadrachalam Brahmotsavam) రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha), భద్రాచలం దేవస్థానం అర్చకులు, అధికారులు ఆహ్వానించారు.

Update: 2025-03-23 09:21 GMT
భద్రాచలం బ్రహ్మోత్సవాలకు రండి.. CM రేవంత్‌ను ఆహ్వానించిన మంత్రి
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు(Bhadrachalam Brahmotsavam) రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha), భద్రాచలం దేవస్థానం అర్చకులు, అధికారులు ఆహ్వానించారు. ఆదివారం సీఎం నివాసంలో స్వయంగా కలిసి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Tummala Nageswara Rao)కు ఆహ్వాన పత్రిక అందించారు.

ఈ సందర్భంగా వారు శ్రీరామనవని బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి సంబంధించి అవసరమైన భూసేకరణ, ఇతర వివరాలను అధికారులను అడిగి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలుసుకున్నారు. అవసరమైన భూసేకరణ, నిధులకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి, ఆలయ అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News