అక్కడ కేసీఆర్‌కు దొంగనోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉంది.. కేంద్రమంత్రి సంచలన ఆరోపణలు

బీఆర్ఎస్‌(BRS), కాంగ్రెస్‌(Congress)పై కేంద్ర హోంశాఖ సహాయ బండి సంజయ్‌(Bandi Sanjay) విమర్శలు తీవ్ర విమర్శలు చేశారు.

Update: 2025-03-23 08:06 GMT
అక్కడ కేసీఆర్‌కు దొంగనోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉంది.. కేంద్రమంత్రి సంచలన ఆరోపణలు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్‌(BRS), కాంగ్రెస్‌(Congress)పై కేంద్ర హోంశాఖ సహాయ బండి సంజయ్‌(Bandi Sanjay) విమర్శలు తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. BRS అధినేత కేసీఆర్‌(KCR)కు బీదర్‌లో దొంగనోట్ల ప్రెస్‌ ఉందని సంచలన ఆరోపణలు చేశారు. అక్కడ ప్రింటింగ్ చేసిన దొంగ నోట్లే ఎన్నికల్లో పంచారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అప్పుల పాలైందని విమర్శించారు. రూ.6 లక్షల కోట్ల అప్పు ఉందని ప్రభుత్వమే చెబుతోందని అన్నారు. బీఆర్ఎస్ నిర్వాకం వల్ల ప్రభుత్వ భూములు అమ్మితే గాని ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. కమీషన్లు ఇచ్చేవారికే బిల్లులు చెల్లిస్తున్నారు.. ఆ కమీషన్లు 15 నుంచి 18 శాతానికి పెంచారని ఆరోపించారు.


ఎన్నికల్లో ఉద్యోగులకు కాంగ్రెస్(Congress) అనేక హామీలిచ్చింది.. ఉద్యోగులకు ఇచ్చిన హామీలకు రూ.8 వేల కోట్లు కావాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ విధానాలు చూస్తుంటే మరో మూడు నెలల తర్వాత జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలుచేయకుండా మోసం చేస్తే పుట్టగతులుండవని హెచ్చరించారు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్లు చరిత్రలో లేదన్నారు. రైతులు తలుచుకుంటే ప్రభుత్వాలను మార్చేయగలరన్నారు. నరేంద్రమోడీ(PM Modi) ప్రభుత్వం(NDA Govt) ప్రవేశపెట్టిన ఎఫ్‌‌‌‌‌‌‌‌పీవో వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Tags:    

Similar News