KTR: మాజీ మంత్రి కేటీఆర్‌కు బిగ్ షాక్.. రెండు కేసులు నమోదు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR)కు బిగ్ షాక్ తగిలింది.

Update: 2025-03-26 02:13 GMT
KTR: మాజీ మంత్రి కేటీఆర్‌కు బిగ్ షాక్.. రెండు కేసులు నమోదు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR)కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆయనపై నకిరేకల్ (Nakrekal) పీఎస్‌లో రెండు కేసులో నమోదయ్యాయి. నకిరేకల్‌ పట్టణంలో పదో తరగతి తెలుగు పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌ అయిందంటూ సోషల్‌ మీడియా (Social Media)లో తప్పుడు ప్రచారం చేశారంటూ కేటీఆర్‌ (KTR)‌పై మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చౌగోని రజిత (Rajitha), కాంగ్రెస్ నేతలు (Congress Leaders) ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నకిరేకల్ పోలీసులు కేటీఆర్‌తో పాటు సోషల్‌ మీడియా ఇంచార్జి మన్నె క్రిశాంక్‌ (Manne Krishank), కొణతం దిలీప్‌ కుమార్‌‌ (Konatham Dilip Kumar)లపై రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. పేపర్ లీక్ అయిందంటూ వెబ్‌సైట్‌ (Website)లో వచ్చిన వార్తను వాస్తవాలు తెలుసుకోకుండా కేటీఆర్‌ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్)‌లో షేర్‌ చేశారని ఆ ఫిర్యాదులో తెలిపారు. అయితే, పేపర్ లీకేజీ వ్యవహారంలో పోలీసులు ఇప్పటి వరకు ఒక మైనర్‌ బాలికతో పాటు ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

Tags:    

Similar News