విజయవాడ ఘటనపై రిపోర్ట్.. రమేష్ ఆస్పత్రిదే..
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ అగ్నిప్రమాదం ఘటనపై నాలుగు పేజీల రిమాండ్ రిపోర్టును ప్రభుత్వం విడుదల చేసింది. రమేష్ ఆస్పత్రి, స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని రిపోర్టులో పేర్కొన్నది. కొవిడ్ చికిత్స అందజేయడానికి స్వర్ణప్యాలెస్ ను రమేష్ ఆస్పత్రి తీసుకున్నదని, ఈ విషయమై రెండు యాజమాన్యాలు ఎంఎస్ వోయూ కుదుర్చుకున్నాయని పేర్కొన్నది. స్వర్ణప్యాలెస్ లో విద్యుత్ లోపాలున్నాయని రమేష్ ఆసుపత్రి యాజమాన్యం గమనించింది.. కానీ, వాటిని సరిచేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుందని పట్టించుకోకుండా […]
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ అగ్నిప్రమాదం ఘటనపై నాలుగు పేజీల రిమాండ్ రిపోర్టును ప్రభుత్వం విడుదల చేసింది. రమేష్ ఆస్పత్రి, స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని రిపోర్టులో పేర్కొన్నది. కొవిడ్ చికిత్స అందజేయడానికి స్వర్ణప్యాలెస్ ను రమేష్ ఆస్పత్రి తీసుకున్నదని, ఈ విషయమై రెండు యాజమాన్యాలు ఎంఎస్ వోయూ కుదుర్చుకున్నాయని పేర్కొన్నది.
స్వర్ణప్యాలెస్ లో విద్యుత్ లోపాలున్నాయని రమేష్ ఆసుపత్రి యాజమాన్యం గమనించింది.. కానీ, వాటిని సరిచేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుందని పట్టించుకోకుండా కొవిడ్ కేర్ సెంటర్ తెరిచిందని, విద్యుత్ లోపాలను సరిచేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని రిపోర్టులో వెల్లడించింది. లోపాలున్న కొవిడ్ సెంటర్ ను నడిపినందుకు రమేష్ ఆస్పత్రిదే బాధ్యత అని, కొవిడ్ సెంటర్ నిర్వహించడానికి ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోలేదని, నిందితులు బయటకు వస్తే ఆధారాలు తారుమారు చేసే అవకాశముందని రిమాండ్ రిపోర్టు పేర్కొన్నది.